కుప్పకూలిన విమానం…. సురక్షితంగా బయటపడ్డ 97 మంది

డురంగో: మెక్సికోలో విమానం కుప్పకూలింది. అయితే విమానంలోని 97 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. విమానం డురంగో నుంచి మెక్సికో సిటీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోగానే ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రతికూల వాతావరణమే విమానం కుప్పకూలిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తాము ప్రమాదం నుంచి బయటపడటం నమ్మలేకపోతున్నామన్నారు. ఘటనపై మెక్సికో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*