
కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాగుపల్లిలో సెల్‌ఫోన్ పేలి మస్తాన్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ఛార్జింగ్ పెట్టి నిద్రపోవడంతో సెల్‌ఫోన్ పేలిందని అతడి బంధువులు చెబుతున్నారు. పేలుడు ధాటికి మస్తాన్ చెయ్యి కాలిపోయింది. నిద్రలోనే అతడు కన్నుమూశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడులో మస్తాన్ చనిపోవడంతో వాగుపల్లితో పాటు కనిగిరి మండలంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Be the first to comment