‘డు మొబైల్’ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘మేట్ 1’

చైనాకు చెందిన షెంజాన్ యునైటెడ్ టైమ్ టెక్నాలజీ భారత అనుబంధ సంస్థ ‘డు మొబైల్’ భారత్‌లోకి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ‘మేట్ 1’ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.6,299 మాత్రమే.

5.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉంది. 13 ఎంపీ ఆటో ఫోకస్+0.3 ఎంపీ ఫిక్స్‌డీ ఫోకస్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ, 32జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.

అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్లు కలిగిన ఫోన్ కావాలనుకున్నప్పుడు యూజర్లకు ‘మేట్ 1’ చక్కని ఆప్షన్ అని డు మొబైల్ సీఈవో లి యుంచున్ తెలిపారు. 4జీ సౌకర్యం కలిగిన ఈ ఫోన్‌లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2800 ఎంఏహెచ్ లియాన్ ఐయాన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్నాయి.

బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై, ఎఫ్ఎం రేడియో, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, డిస్టెన్స్ సెన్సార్ సహా ఇంకా బోలెడు ఫీచర్లు ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. గోల్డ్ కలర్ వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*