
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో దిగ్జజ సంస్థలైన యాపిల్, శాంసంగ్‌లను వెనక్కి నెట్టేసి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. రూ.30 వేలకుపైగా ధర కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో అత్యధిక మార్కెట్ షేర్‌తో దుమ్మురేపుతోంది. ఏప్రిల్‌తో మొదలై జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా 40 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుని టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. 30 శాతం మార్కెట్ షేర్‌తో శాంసంగ్ రెండో స్థానంలో నిలవగా, అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ 14 శాతం షేర్‌తో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో విదేశీ మొబైల్ మేకర్ల దృష్టి ఇటువైపు పడింది. ఇప్పటికే భారత మార్కెట్లో నిలదొక్కుకున్న విదేశీ బ్రాండ్ల కంటే నిన్నమొన్న మార్కెట్లోకి వచ్చిన చైనీస్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడంలో సఫలీకృతమవుతున్నాయి. దీనికితోడు భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు విపరీతమైన గిరాకీ ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. చైనీస్ బ్రాండ్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా అవి వెనకబడిపోతున్నట్టు కౌంటర్ పాయింట్ తెలిపింది.
Be the first to comment