కరుణను పరామర్శించిన ఇళయ దళపతి విజయ్

చెన్నై: తమిళ స్టార్ యాక్టర్, ఇళయ దళపతి విజయ్ డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. కరుణ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కరుణ తనయుడు స్టాలిన్‌ను కలిశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం పినారాయి విజయన్ నేడు కరుణను పరామర్శించనున్నారు.

కరుణను నిన్న సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ ప‌రామ‌ర్శించారు. కలైంజర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ర‌జినీ ఆకాంక్షించారు.

అంత‌కుముందు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కరుణను ప‌రామ‌ర్శించారు.

క‌రుణ‌ను ఇప్ప‌టికే తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు.

 

కావేరీ ఆసుపత్రి ఐసీయూలో ఎనిమిది మంది నిపుణుల బృందం కరుణను పర్యవేక్షిస్తోంది. 94 ఏళ్ల కరుణానిధి కొద్ది రోజులుగా జ్వరం, లో బీపీ, మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. కలైంజర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని కావేరీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*