ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం..

వరంగల్: వరంగల్ వన్ ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 బస్సులు పూర్తిగా దగ్ధమవడంతో అరకోటికి పైగా నష్టం వాటిల్లింది. బస్సుకు బ్యాటరీ మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మరోవైపు ఘటనా స్థలాన్ని ఆర్టీసీ చైర్మెన్ సత్యనారాయణ పరిశీలించారు. రాజధాని బస్సును సూపర్ లగ్జరీ బస్సుగా మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఐదు బస్సులు పూర్తిగా, మూడు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*