
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫీచర్ ఫోన్లలో వృద్ధులు సులభంగా ఆపరేట్ చేసుకునేవి అరుదనే చెప్పాలి. అత్యవసర సమయాల్లో తమవారికి ఫోన్ చేసుకునేందుకు వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేతిలో ఫోన్ ఉన్నా తెలిసిన వారితోనే, పక్కింటి వారితోనే కావాల్సిన నంబరుకు ఫోన్ చేయించుకుని మాట్లాడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఫీచర్ ఫోన్లలోని సాంకేతిక విధానం కొంచెం క్లిష్టంగా ఉండడమే అందుకు కారణం.
సరిగ్గా ఇవే అంశాలను దృష్టిటో పెట్టుకుని దేశీయ ఎలక్ట్రానిక్ మేకర్ ఐబాల్ వృద్ధుల కోసం తయారు చేసిన సరికొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఆసాన్ 4’ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.3,499 మాత్రమే.
పెద్ద కీప్యాడ్, స్పష్టంగా వినిపించే ఆడియో, స్క్రీన్‌పై పెద్దపెద్ద ఫాంట్లు, ఎమర్జెన్సీ అలెర్ట్, మొబైల్ ట్రాకింగ్ ఫంక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ ఫోన్ డిస్ప్లే 2.31 అంగుళాలు. ఇందులో బ్రెయిలీ కీ ప్యాడ్ కూడా ఉండడం మరో విశేషం.
ఆసాన్ 4లో ఉన్న ఇంకో ఫీచర్ ‘టాకింగ్ కీ ప్యాడ్’ మొబైల్ నంబర్లను నొక్కినప్పుడు మనం ఏ నంబరు నొక్కామో ఇంగ్లిష్‌లో వినిపిస్తుంది. దీనివల్ల వృద్ధులు అనుకున్న నంబరుకు సరిగ్గా డయల్ చేసే అవకాశం ఉంది. 1,800 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. 32జీబీ మెమొరీ కార్డును సపోర్టు చేస్తుంది. 200 టెక్ట్స్ మెసేజ్‌లను, 1000 నంబర్లను భద్రపరుచుకోవచ్చు.
ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేయవచ్చు. ఆ బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే సైరన్ కూడా వినిపిస్తుంది. అలాగే వన్‌టచ్ ఫోన్ లాక్, ఎల్ఈడీ టార్చ్, వైర్లెస్ ఎఫ్ఎం ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
Be the first to comment