ప్రధాని మోదీతో రెబల్‌స్టార్ కృష్ణంరాజు భేటీ

భారత ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు భేటీ అయ్యారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న కృష్ణం రాజు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కీలక నివేదికను ఇరువురికీ అందించినట్టు తెలుస్తోంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన కీలక అంశాలపై నివేదికను అందించారని సమాచారం. ఏపీలోని వెనుకబడి జిల్లాలు, ప్రాంతాలపై ఈ నివేదికలు పలు వివరాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. పార్లమెంటులో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నకృష్ణం రాజు ఇటీవల మళ్లీ చురుకైన పాత్రా పోషిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉందని  చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న ఆయన టీడీపీపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్‌షాలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*