నెల్లూరు జిల్లాలో కలకలం.. రాపూరు ఎస్సైని పోలీస్ స్టేషన్‌లోనే చితకబాదిన గ్రామస్థులు

రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సైపై స్థానికులు దాడి చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకుడిని ఎస్సై లక్ష్మణరావు కొట్టారంటూ అతడి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు.  సెల్‌లో దాక్కున్న లక్ష్మణరావును లాక్కొచ్చి మరీ కొట్టారు. అతడితో పాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ళను కూడా చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. తీవ్ర గాయాలపాలై, రక్తమోడుతున్న లక్ష్మణరావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి.

దాదాపు 300 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉండడం గమనార్హం. స్థానికుల దాడితో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాడితో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎస్సై వ్యవహారశైలి వల్లే దాడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై విచారణ జరుగుతోంది. బాధ్యులెవరనేది దర్యాప్తులో తేలనుంది. అయితే పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేయడం, పోలీస్ స్టేషన్‌లో ఎస్సైని, కానిస్టేబుల్‌ను చితక్కొట్టడం కలకలం రేపుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*