
రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సైపై దాడి చేసిన ఎస్సీ కాలనీలోని 50 మందిలో 30 మందిని పోలీసులు గుర్తించారు. వీరిని ఐజీ గోపాల్‌రావు ఎదుట ప్రవేశపెట్టారు. మరోవైపు ఎస్ఐ వ్యవహారశైలి బాగోలేదనడం తప్పని ఐజీ గోపాల్‌రావు చెప్పారు. ఘటనపై తాము విచారణ జరిపామన్నారు. గాయపడి చికిత్స పొందుతున్న ఎస్ఐ లక్ష్మణరావును, కానిస్టేబుళ్లను ఐజీ గోపాలరావు, ఎస్పీ రామకృష్ణ పరామర్శించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై స్థానికులు దాడిచేయడం తప్పని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని శిక్షిస్తామన్నారు.
రమేశ్ అనే యువకుడిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకుని కొట్టినందుకు రాపూరు ఎస్సీకాలనీ వాసులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. సుమారు 50 మంది దాడిచేసి ఎస్ఐ లక్ష్మణరావుతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. రక్తస్రావమైన ఎస్ఐ లక్ష్మణరావుతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Be the first to comment