రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే?

న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. టీడీపీ ఎంపీలు ప్రస్తావించిన అంశంపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. వెంటనే సదరు మంత్రిత్వ శాఖను ఆదేశించి అధ్యయనం చేయాలని కోరతానని కోవింద్ వారితో చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకునేలా కోరతానని కోవింద్ హామీ ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఫొటోలు షేర్ చేశారు.

 

 

అంతకు ముందు రాష్ట్రపతి కార్యాలయం టీడీపీ ఎంపీలు కోవింద్‌ను కలిసిన ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేసింది.

రాష్ట్రపతిగా కోవింద్ ఎన్నిక కావడంలో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాటం చేస్తున్న వేళ టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*