ప్రాణాలు విడిచిన దుర్గాడ నాగుపాము.. గుండెలు పగిలిపోయేలా విలపిస్తున్న భక్తులు

దుర్గాడ: తూర్పు గోదావరి జిల్లా దుర్గాడలో 26 రోజులుగా పూజలందుకున్న నాగుపాము ప్రాణాలు విడిచింది. గ్రామస్థులకు ఎటువంటి హానీ చేయని ఈ నాగుపాము సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమని భక్తులు నమ్మి పూజలు చేశారు. నిన్న కుబుసం విడిచి చురుగ్గా ఉన్న నాగుపాము ఒక్కసారిగా ప్రాణాలు విడవడంతో భక్తజనం తట్టుకోలేకపోతున్నారు. పామును చూస్తూ గుండెలు పగిలిపోయేలా విలపిస్తున్నారు.

మరోవైపు ఈ నాగుపాముకు గుడికడతామని దుర్గాడ గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికే గుడి నిర్మాణానికి సంబంధించి కొంత చందాలు వసూలు చేస్తారు. మరికొంత వసూలు చేసి పెద్ద దేవాలయాన్ని కడతామని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*