ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. సోపోర్ జిల్లాలోని ద్రూసు గ్రామంలో జరిగిన హారాహోరీ కాల్పుల్లో సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాదులు దాగున్నారనే పక్కా సమాచారంతో సైన్యం రంగంలోకి దిగింది. తొలుత గ్రామాన్ని చుట్టుముట్టి ఆ తర్వాత ఉగ్రవాదులు దాగున్న చోటును గుర్తించింది. సైన్యం రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పఠాన్ కోట్ తరహా దాడికి పాక్ ఉగ్రవాదులు కుట్ర పన్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తనిఖీలు ముమ్మరం చేశాయి. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*