
బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో 172 బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. టెస్ట్ కెరీర్లో కోహ్లీకిది 22వ సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 287 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయినా కోహ్లీ ఒక్కడే నిలబడ్డాడు. సెంచరీ బాదేశాడు. విజయ్ 20, ధావన్ 26, రాహుల్ 4, రహానే 15, పాండ్యా 22, అశ్విన్ 10, షమీ 2, శర్మ 5, యాదవ్ 1 పరుగులు చేశారు. దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యాడు.
Be the first to comment