సికింద్రాబాద్‌లో కలకలం.. హోటల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య?

హైదరాబాద్: మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికిరణ్ యాదవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో బెల్సన్ తాజ్ హోటల్ గదిలో మరణించాడు. కాప్రా ఎల్లారెడ్డి గూడకు చెందిన 37 ఏళ్ల సాయికిరణ్‌కు భార్య స్రవంతి, రెండున్నరేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ నెల 1వ తేదీన ఆయన సికింద్రాబాద్ లోని బెల్సన్ తాజ్ హోటల్ 305రూంలో దిగాడు. నాటి నుంచీ బయటకు రాలేదు.

శుక్రవారం సతీష్ అనే సాయి కిరణ్ స్నేహితుడు హోటల్ కు వచ్చి తలుపులు కొట్టినా తీయ లేదు. హోటల్ సిబ్బందిని అడిగితే ఆ గదికి మరొకరు వచ్చారని చెప్పడంతో మనోజ్ వెళ్లి పోయాడు. రాత్రి 9.30 గంటల సమయంలో హోటల్ సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా సాయికిరణ్ చనిపోయి ఉన్నాడు.

 

మహంకాళి పోలీసులకు సమచారం ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్ రమేష్ అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి నోటి నుంచి రక్తం వస్తుండటంతో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*