వనస్థలిపురంలో మహిళ హల్‌చల్.. షాకైన పోలీసులు

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో మహిళ హల్‌చల్ చేసింది. కాకినాడకు చెందిన క్యాబ్‌డ్రైవర్ శ్రీనివాస్ చింతల్ బస్తీకి చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్‌లోనే చెప్పుతో కొట్టింది. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. మహిళను హెచ్చరించారు. శ్రీనివాస్‌ను పక్కకు తీసుకెళ్లారు. కేసుపై విచారణ జరుపుతున్నారు.

శ్రీనివాస్‌కు గతంలో మరో మహిళతో వివాహం జరిగింది. ఆమెను వదిలిపెట్టి చింతల్ బస్తీకి చెందిన మహిళతో సహజీవనం చేస్తూ ఆమె వద్దే భారీ మొత్తంలో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ఆమె శ్రీనివాస్‌ను చెప్పు తెగిపోయేలా కొట్టింది. దీంతో పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్‌లో అంతా షాక్ తిన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*