కొత్త జోనల్ వ్యవస్థకు మోదీ ఆమోదం లభించేనా?

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హస్తినలో బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీలో ఆయన కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలుసుకున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కొత్త జోన్లకు రూపకల్పన చేశామని, ఆమోదించాలని కోరారు. ఆర్టికల్ 371డీని సవరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్తగా 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేశామని, మరోసారి జోన్లు, మల్టీ జోన్లు, రాష్ట్ర కేడర్లను మరోసారి విభజించాలన్నారు.

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి కూడా కేసీఆర్ రవిశంకర్ ప్రసాద్‌తో చర్చించారు. రవిశంకర్‌ ప్రసాద్‌తో సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎంతోపాటు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఉపపక్ష నేత వినోద్‌ కూడా పాల్గొన్నారు.

కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుంటారు. కొత్త జోన్లను ఆమోదించాలని కోరతారు. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*