
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ తన బంతితో మాయ చేశాడు. మూడు వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. అయితే ఈ క్రమంలో అద్భుతమైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.
టెస్టుల్లో ఒకే కెప్టెన్ నేతృత్వంలో 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో మరో ఘనత కూడా దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఒకే కెప్టెన్ నేతృత్వంలో వేగంగా 200 వికెట్ల మైలురాయిన చేరుకున్న రెండో బౌలరర్గా అవతరించాడు.
అశ్విన్ ఈ ఫీట్‌ను 34 టెస్టుల్లో సాధించగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ 30 మ్యాచ్‌లలోనే సనత్ జయసూర్య నేతృత్వంలో 200 వికెట్లను సాధించాడు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో షేన్ వార్న్ కూడా 34 మ్యాచ్‌లలో 200 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్ స్పిన్ విజృంభణతో 3 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ ఫాస్ట్ బౌలింగ్‌తో వీర విహారం చేసి 4 వికెట్లు తీయడంతో భారత్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ముగిపోయింది.
This post is also available in : English
Be the first to comment