
ఈసారి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అవార్డు ప్రధానంలో సంచలనం జరగబోతోంది. ఈమేరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. నలుగురు పేర్లను ఇందుకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు నలుగురికి భారత రత్న ఇవ్వాలని భావించడమే ఒక సంచలనం.
ప్రతిసారీ భారత ప్రధాని ముగ్గురి పేర్లను రాష్ట్రపతికి ప్రతిపాదిస్తారు. ఈ భారతరత్న అవార్డులను మొదలు పెట్టిన 1954 సంవత్సరంలో కూడా ముగ్గురిని ప్రతిపాదించారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ముగ్గురి కన్నా ఎక్కువ మందిని లెక్కలోకి తీసుకోలేదు. కానీ ఈసారి మోదీ ప్రభుత్వం నలుగురికి భారత రత్న ఇవ్వాలని యోచిస్తోంది.
ఆ నలుగురిలో ముగ్గురు పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. ఒకరు ప్రముఖ దివంగత దళిత నేత, బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్, ఇంకొకరు బీజేపీ కురువృద్ధులు, సీనియర్ నాయకులు ఎల్. కె. అద్వాణీ, ముడో వ్యక్తి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.
కాన్షీరామ్‌కు భారత్‌లో అంబేడ్కర్ తర్వాత అంతటి నేతగా బాగా పేరుంది. ఈయనకు దళితుల్లో బాగా పేరుంది. చాలా కాలం నుంచి కాన్షీరామ్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం ఆయన పేరును పరిగణలోకి తీసుకుంది. దళితుల్లోకి పార్గీ చేరుకునేందుకు బీజేపీకి ఇది బాగా ఉపయోగపడనుంది.
భారత రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన అద్వానీ దేశానికి, బీజేపీ పార్టీకి ఆది నుంచి ఎంతో సేవ చేశారు. ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా బీజేపీలో అద్వాణీ మాదిరిగానే కాంగ్రెస్‌లో ఉండి రాజకీయాల్లో ఎంతో సేవ చేశారు. ఈయనకు భారతరత్న అవార్డు ప్రధానం చేసిన తర్వాత బీజేపీకి పశ్చిమ బెంగాల్లో లాభం వస్తుంది.
ఇక నాలుగో వ్యక్తి గురించి మాత్రం ఏపేరు విపించడం లేదు. అయితే అది దక్షిణ భారత దేశం నుంచి ఉంటుందని మాత్రం ప్రచారం జరుగుతుంది. మరి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రాంతం నుంచి ఆ వ్యక్తి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆంధ్ర నుంచి ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కోణంలో ఆ నాలుగో వ్యక్తి ఎన్టీఆర్ అనేది ప్రస్తుతానికి ఉన్న ఊహాగానం. మోదీ సర్కార్ దక్షిణ భారత దేశం నుంచి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించి ఏపీలో సంచలనం సృష్టించబోతున్నారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
This post is also available in : English
Be the first to comment