ముఖ్యమంత్రి-యువనేస్తంపై కదిలిన యువతరం

అమరావతి: 12.26 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై యువతరం నుంచి హర్షం వ్యక్తమౌతోంది. యువత పెద్దఎత్తున ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి తరలివస్తున్నారు. నిరుద్యోగ భృతి కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నారు. తాను మాట నిలబెట్టుకున్నానని, నిరుద్యోగులను ఆదుకునేందుకే ఈ పథకానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి తెలిపారు.

కేబినెట్ నిన్న ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ఆన్‌లైన్లో తమ పేర్లను, వివరాలను నమోదు చేసుకోవచ్చు.

‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ ఆధార్‌ సంఖ్యను కూడా అనుసంధానం చేస్తారు. ఈ పథకం ద్వారా పాలిటెక్నిక్‌ లేదా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు భృతి అందిస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక నిరుద్యోగులకు సెప్టంబర్ రెండో వారంలో భృతి అందించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా రూ.600 కోట్లు, ఏడాదికి రూ.8,000 కోట్లు ఖర్చు చేయనుంది. నిరుద్యోగ భృతి కల్పించడంతో పాటు ఉద్యోగ నైపుణ్యాల్లో ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసి అంప్రెటీస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.

20 వేల ఉద్యోగాలు, 9 వేల టీచింగ్ పోస్ట్‌లు కూడా భర్తీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*