ఇంటి ముందు చెట్టు నరికించినందుకు భారీ షాక్..

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చెట్టుకున్న విలువను తెలిపే సంఘటన జరిగింది. ఓ ఇంటి ఓనర్ శ్యామల తన ఇంటి ముందు ఉన్న భారీ వృక్షాన్ని నరికినందుకు అధికారులు ఆమెకు రూ. 5000 ఫైన్ విధించారు. దీంతో ఆ ప్రాంతంలో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ సుమిత్ కుమార్ గాంధీ నగరంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు.

ఈ సమయంలో భారీ వృక్షాన్ని నరికించడం గమనించిన ఆయన ఆ ఇంటి ఓనర్ అయిన పిల్లి శ్యామల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తన ఇంటికి వెళ్లేందుకు ఉన్న దారికి ఈ చెట్టు అడ్డు వస్తుందని ఆమె సమాధానం ఇచ్చారు. అసహనానికి గురైన ఆయన వెంటనే ఆమెను… అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అని ప్రశ్నించగా ఆమె లేదని చెప్పారు.

దీంతో ఆయన రివెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను పిలిపించి ఫైన్ విధించాలని ఆదేశించారు. రూ. 5000లను ఫైన్ విధించి, ఆ మొత్తాన్ని కార్పొరేషన్ ట్రెజరీకి పంపించాలని సూచించారు.

రాజమండ్రి చరిత్రలోనే తొలిసారిగా చెట్టు నరికించినందుకు ఫైన్ వేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*