తను ఇష్టపడే అమ్మాయినే ప్రేమిస్తున్నాడని… బీ టెక్ విద్యార్ధి ఘాతుకం..

రేణిగుంట: చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు బీ టెక్ విద్యార్ధుల్లో ఒకరు మరొకరిని చంపేశారు. ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. రేణిగుంట మండలం కారకంబాడీ సమీపంలోని శ్రీ రామ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న గాజులమండ్యం‌కు చెందిన వంశీ రాయల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామచంద్రాపురం, మండలం గంగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జానకిరామిరెడ్డి అనే బిటెక్ రెండవ సంవత్సరం విద్యార్ధిని చంపేశాడు.

ఒకే అమ్మాయిని ప్రేమించిన వీరు తరచూ కళాశాలలో గొడవపడేవారు. గొడవలు సెటిల్ చేసుకునేందుకు రావాలని జానకి రామిరెడ్డిని వంశీరాయల్ పిలిచాడు. తన ఊరికి వెళదామని పిలిచి మరో ఏడుగురు విద్యార్ధులతో కలిసి గాజులమండ్యం పెట్రోలు బంకు వెనుక ఉన్న వెంచర్లో ప్రాణాలు తీశాడు. ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో జానకిరామరెడ్డి మెడపై పొడిచిన వంశీ రాయల్ అక్కడినుంచి పరారయ్యాడు పక్కనే ఉన్న తోటి విద్యార్థి దిలీప్ అనే విద్యార్థికి ముఖంపైనా, భుజంపైన కత్తితో గాయపరిచాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు జానకి రామిరెడ్డిని సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న గాజులమండ్యం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వంశీ రాయల్ కోసం గాలింపు ప్రారంభించారు. బీ టెక్ చదివే వయసులో ప్రేమకోసం తోటి విద్యార్ధి ప్రాణం తీసిన వంశీరాయల్‌ను కఠినంగా శిక్షించాలని జానకి రామిరెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*