కాల్వకు పరిటాల సునీత పరామర్శ

అనంతపురం: నిన్నటి రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన మంత్రి కాల్వ శ్రీనివాస్‌ను మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. అనంతపురంలోని మంత్రి నివాసానికి వెళ్లి కాల్వ శ్రీనివాస్‌ను పరామర్శించారు.

నిన్న బెలుగుప్ప మండలం కాలువపల్లి సమీపంలో మంత్రి కాల్వ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఘటనలో స్వల్ప గాయాలతో మంత్రి బయటపడ్డారు. మంత్రి స్వల్పగాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాల్వ గతంలో కూడా భారీ ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*