కరుణకు బాబు పరామర్శ

చెన్నై: అనారోగ్యంతో కావేరి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత‌ కరుణానిధిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. స్టాలిన్‌, కనిమొళిని అడిగి కరుణ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. కరుణ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వెంట సోమిరెడ్డి, మస్తాన్ రావు ఉన్నారు.

ఇప్పటికే కరుణను మాజీ ప్రధాని దేవెగౌడ, కేరళ సీఎం విజయన్, తమిళ సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్, ఇళయ దళపతి విజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు.

క‌రుణ ఆరోగ్యం మెరుగుపడుతోందని కావేరీ ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*