రానా చంద్రబాబులా నటిస్తున్నారు: క్రిష్

నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌తో కలిసి నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్డీఆర్ జీవితం అనంతమైన చరిత్ర అని చెప్పారు.

బాలకృష్ణ ఇంకా ఏమన్నారంటే!

ఎన్టీఆర్ తన విషయాలను ఎప్పుడూ బయటకు చెప్పకపోవడం ఆయన గొప్పతనం

-ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి కారణం ఒక నటుడుగా నామీద ఉన్న ప్రభావం ఒకటి

-రెండోది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం – రాష్ట్రంలో ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చారు

-ఎన్టీఆర్ పథకాలను దేశం మొత్తం అనుసరిస్తున్నాయి

-ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత రామారావు కొడుకుగా నాపై ఉంది

– క్రిష్ దర్శకత్వంలో గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ సినిమాలను తీయడం మా అదృష్టం

– ఒక కొడుకు తండ్రి పాత్రను పోషించడం చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం

– సినీ ఇండ్రస్టీలో కదలిక, చలనం, చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీఆర్

– చలనచిత్రాలతోనే కాదు… సమాజంలో కూడా మార్పులు తీసుకువచ్చిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్

– దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది

– తరతరాలకు ఎన్టీఆర్‌ను గుర్తు చేసేందుకు బయోపిక్ తీయడం జరుగుతోంది

– నవంబర్ చివరి వారంలో నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ఉంటుంది

– జనవరి 9వ తేదీన బయోపిక్ రిలీజ్ అవుతుంది

– ఎన్టీఆర్ సినిమా ఒక పార్టీకి, వర్గానికి, కులానికి సంబంధించింది కాదు…ప్రజలందరికి సంబంధించింది.

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ తీయడం తన అదృష్టమన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా బాలయ్య తల్లి రుణం తీర్చుకున్నారని, ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తండ్రి రుణం తీర్చుకుంటున్నారని క్రిష్ చెప్పారు. ఎన్టీఆర్ గురించి జనానికి తెలిసింది ఒక శాతమేనని, ఇంకా 99 శాతం తెలియాల్సి ఉందన్నారు. సినిమాలో రానా చంద్రబాబులా నటిస్తున్నారని క్రిష్ తెలిపారు.

ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ నిన్న చంద్రబాబుతో సమావేశమైంది. అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయాలని కోరిన చంద్రబాబు విలువైన సూచనలిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*