టెస్టుల్లో కోహ్లీ సరికొత్త రికార్డ్..

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. ఆగష్టు 5న ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను పక్కకు నెట్టి విరాట్ నంబర్ వన్ టెస్ట్ ర్యాంకును సాధించాడు. దీంతో టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఏడో భారత ఆటగాడిగా కోమ్లీ అవతరించాడు.

కోహ్లీ కంటే ముందు ఈ ఘనతను గవాస్కర్, సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, దిలీప్ వెంగ్ సర్కార్ సాధించారు. 2011 జూన్‌లో సచిన్ టెస్ట్ నంబర్ వన్ ర్యాంక్ స్థానాన్ని కోల్పోయిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కోహ్లీ రూపంలో భారత బ్యాట్స్‌మన్ ఆ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 149, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు.

దీంతో 31 పాయింట్లు అదనంగా సాధించి 934 పాయింట్లకు చేరుకుని టెస్టుల్లో అగ్ర స్థానాన్ని ఆక్రమించాడు. ముగిసిన అనంతరం కోహ్లీ భారత జట్టు ఓడినప్పటికీ కోహ్లీ తన బ్యాటింగ్‌తో అందరి మనసులు గెలిచాడు. రెండో స్థానంలో ఉన్న స్మిత్‌ 929 పాయింట్ల వద్ద ఉన్నాడు.

బ్యాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేధానికి గురైన స్మిత్ గత కొంత కాలంగా క్రికెట్ ఆడటం లేదు. 12 నెలల పాటు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. 2019 మార్చి వరకు స్మిత్ టెస్టులు ఆడే అవకాశం లేదు. మూడో స్థానంలో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ 865 పాయింట్లతో ఉన్నాడు.

కోహ్లీకి ముందు రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్, సునీల్ గవాస్కర్, వీరేందర్ సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.

తాజా టెస్ట్ ర్యాంక్ వివరాలు..
1) కోహ్లీ, ఇండియా : 934
2) స్మిత్, ఆస్ట్రేలియా : 929
3) రూట్, ఇంగ్లండ్ : 865
4) విలియమ్సన్, న్యూజీల్యాండ్ : 847
5) డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా : 820
6) చతేశ్వర్ పుజారా, ఇండియా : 791
7) కరుణరత్నే, శ్రీలంక : 754
8) దినేశ్ చండీమాల్, శ్రీలంక : 733
9) డీన్ ఎల్గర్, సౌతాఫ్రికా : 724
10) అడిన్ మర్‌క్రమ్, సౌతాఫ్రికా : 703

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*