ఓటమి తర్వాత పాండ్య చేసిన పనికి ప్రశంసల వర్షం

టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య అందరి హృదయాలను టచ్ చేశాడు. ఆకలి విలువ బాగా తెలిసిన పాండ్య ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేము. ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌ను కోల్పోయిన తర్వాత పాండ్య తాను బస చేస్తున్న హోటల్ సిబ్బందికి ఒక భోజనం పార్శిల్ ఇచ్చి ఎవరైనా భోజనం కోసం వచ్చి అడిగితే ఇవ్వమని చెప్పాడట. మ్యాచ్ ముగిసిన తర్వాత కెఎల్ రాహుల్, ఇషాంత్ శర్మలతో కలిసి పాండ్య హోటల్‌కు తిరిగి వచ్చాడు.

వచ్చిన వెంటనే రాహుల్, ఇషాంత్‌లు వారి గదులకు వెళ్లిపోగా చివరిన కారు దిగిన హార్దిక్ మాత్రం కారు నుంచి భోజనం పార్శిల్ పట్టుకుని దిగాడు. దాన్ని తీసుకుని నేరుగా హోటల్ సిబ్బందికి వెళ్లి అందజేశాడు. ఎవరైనా భోజనం కోసం వచ్చి అడిగితే ఈ పార్శిల్ ఇవ్వాలని, తాము దీన్ని ముట్టుకోలేదని చెప్పాడాట. దీంతో ఆ హోటల్ సిబ్బంది ఓకె సార్ అని బదులిచ్చారట.

ఆ హోటల్‌లో రాత్రి సమయంలో భోజనం కోసం వచ్చి అడగటం రోజు జరుగుతూనే ఉటుంది. అందుకే హార్దిక్ భోజనం పార్శిల్‌ను అలా సిబ్బందికి ఇచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసినప్పటి నుంచీ అభిమానులు పాండ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హార్దిక్ ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీసేన 31 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలవ్వగా.. ప్రస్తుతం 9వ తేదీ నుంచి జరగనున్న రెండో టెస్ట్ కోసం సిద్ధమౌతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*