హర్ధిక్.. స్టోక్స్‌ను చూసి నేర్చుకో.. : ఇయాన్ చాపెల్

లండన్: టీమిండియా గత కొంత కాలంగా ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ కోసం ప్రయోగాలు చేస్తోంది. ఆ ప్రయత్నంలో ముందువరుసలో ఉన్నది హార్ధిక్ పాండ్యానే. అయితే హార్ధిక్‌ ఇంకా కుదురుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో హార్ధిక్ మొత్తంగా ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు.

బ్యాటింగ్‌లో కూడా కీలకమైన సమయంలో, మ్యాచ్ చేజారిపోతుందని అనుకుంటున్న సమయంలో కూడా కీలక పాత్ర పోషించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీలంక, సౌతాఫ్రికాలపై బాగా రాణించిన హార్ధిక్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. అయితే ఆసిస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ హార్ధిక్ పాండ్యా గురించి స్పందించారు.

హర్ధిక్ ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌లో మంచి భాగస్వామ్యాన్ని ఏర్పరిచినప్పటికీ ఎక్కువసేపు నిలవలేకపోయాడని చెప్పారు. అటు బౌలింగ్‌లో కూడా రాణించలేదని, అయితే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ నుంచి హార్ధిక్ చాలా నేర్చుకోవాలని అన్నారు.

స్టోక్స్ తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడని, అందులో కోహ్లీ వికెట్ కూడా ఉంది. బ్యాటింగ్‌లో కూడా శ్యామ్ కర్రన్‌తో కలిసి లోయర్ ఆర్డర్‌లో రాణించాడని చాపెల్ చెప్పారు. హార్ధిక్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించాలి, ఆరో స్థానంలో పంపిస్తే అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్టోక్స్‌ను చూసి నేర్చుకుంటే అది హార్ధిక్ లాభిస్తుందని, హార్ధిక్ పాండ్యా తనను తాను నిరూపించుకునేందుకు ఈ టెస్ట్ సిరీస్ మంచి అవకాశం అని చాపెల్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*