
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం సీరియస్గా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి సడెన్గా మళ్లీ క్షీణించింది. ఈ మేరకు ఆయనకు చికిత్సను అందిస్తున్న కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా వారు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బెలిటెన్ను విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, వయసు ప్రభావం కారణంగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడటం సవాలుగా మరిందని వెల్లడించింది.
ఆయనను వైద్య బృందం పర్యవేక్షింస్తోందని, మురో 24 గంటల్లో ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉందని తెలిపారు. హైబీపీ కారణంగా కరుణానిధిని జులై 21న కావేరీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతూ వచ్చిన వైద్యులు, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు వెల్లడించడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది.
Be the first to comment