
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సోదరి లీలమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఆమెకు జరిగిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. చితిపై ఉన్న ఆమెకు నమస్కరించి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ సోమవారం ఉదయం యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోదరి మరణవార్త తెలుసుకుని వెంటనే హైదరాబాద్కు వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్కు లీలమ్మ నాలుగో అక్క. కేసీఆర్కు మొత్తం 10 మంది తోబుట్టువులున్నారు. వీరిలో 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.
Be the first to comment