ఫిలింనగర్‌లో దారుణం… భర్త నోట్లో హిట్ కొట్టి చంపేసిన భార్య

హైదరాబాద్: భర్తను భార్యే చంపేసిన ఘటన ఫిలింనగర్‌ సైదప్ప బస్తీలో కలకలం రేపింది. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో నోట్లో హిట్ కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమనే కోణంలో జగన్ భార్య దేవికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆధారాలు సేకరించిన పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు.

గుంటురు జిల్లా మాచర్లకు చెందిన బానోతు జగన్, భార్య దేవిక, ఇద్దరు పిల్లలతో కలిసి రెండు నెలలుగా ఫిలింనగర్ సైదప్ప బస్తీలో ఉంటున్నారు.

సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లో నుంచి శబ్దాలు వచ్చాయి. ఇంటి యాజమాని వెళ్లి చూసేసరికి జగన్ అప్పటికే విగతజీవిగా పడి ఉన్నాడు. భార్య ఏడుస్తూ ఉంది. ఏం జరిగిందని యజమాని అడిగితే జగన్ భార్య దేవిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొద్ది రోజులుగా భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో అతడి నోట్లో హిట్ కొట్టి చంపేసినట్లు సమాచారం. పిల్లలతో సహా చనిపోదామని భర్త తనతో అన్నాడని అందుకే చంపేశానని దేవిక అంగీకరించినట్లు తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*