కేసీఆర్‌కు నితీశ్ ఫోన్.. ఆసక్తికరంగా మారుతున్న జాతీయ రాజకీయాలు

పాట్నా: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మద్దతివ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ నితీశ్‌కు హామీ ఇచ్చారు.

జేడీయూ అధినేత కూడా అయిన నితీశ్ ప్రస్తుతం ఎన్డీయేతో కొనసాగుతున్నారు. తొలుత మోదీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. లాలూ, కాంగ్రెస్‌లతో కలిసి మహాకూటమిలో చేరారు. ఆ తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. ప్రస్తుతం నితీశ్ మోదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఎన్డీయేలో కీలక భాగస్వామిగా మారారు. ఎంతలా అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనేక సందర్భాల్లో చంద్రబాబు వెళ్లిపోయినా నితీశ్ ఎన్డీయేలో చేరారని, తమకు నష్టమేమీ లేదని ఘనంగా చెబుతున్నారు.

అటు నితీశ్‌కు, ఇటు కేసీఆర్‌కు, బీజేపీకి కూడా ఉమ్మడి శతృవు కాంగ్రెస్. 2019 ఎన్నికల నేపథ్యంలో కూటముల ఏర్పాటు దృష్ట్యా నితీశ్ కేసీఆర్‌ మద్దతు కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేసీఆర్ నితీశ్ పార్టీ అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*