
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడినప్పటికీ తృటిలో మ్యాచ్‌ను చేజార్చుకుంది. కోహ్లీ తప్ప బ్యాటింగ్‌లో ఎవరూ రాణించలేదు. కోహ్లీతో పాటు ఇంకొకరు ఎవరైనా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో ఒక చర్చ తెరపైకి వచ్చింది.
భారత క్రికెట్ జట్టును ఆ సమస్య వదలడం లేదంటూ విశ్లేషణలు వస్తున్నాయి. అదే వన్ మ్యాన్ షో, టీమిండియాలో వన్ మ్యాన్ షో అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్యే. జట్టు మొత్తం మీద ఒకరు మాత్రం అద్భుతంగా ఆడతారు, కానీ మిగతావారి నుంచి సరైన ప్రదర్శన ఉండకపోవడం వల్ల ఫలితం నెగెటీవ్‌గా ఉంటుంది.
ఇది సచిన్ టైంలో బాగా ఉండేది. తర్వాత కొనసాగుతూ వచ్చింది. ధోనీ, కోహ్లీ ఎంటర్ అయిన తర్వాత బాగా తగ్గింది. అయితే అప్పుడప్పుడు ఈ సమస్య భారత్‌ను పలకరిస్తుంటుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అదే జరిగింది. కోహ్లీ ఒక్కడే 200కి పరుగులు చేస్తే మిగతా బ్యాట్స్‌మన్ అంతా కలిసి అంతే పరుగులుచేశారు.
ఇలా టెస్టుల్లో ఆరు సార్లు వన్ మ్యాన్ షోలు జరిగ్గా అందులో భారత్ రెండు సార్లు గెలవగా మిగతా నాలుగింటిలో ఓడిపోయింది. 1986లో వెంగ్‌సర్కార్, 2006లో రాహుల్ ద్రవిడ్‌ల వన్ మ్యాన్ షో వల్ల భారత్ టెస్ట్ మ్యాచ్‌లు నెగ్గింది. అయితే 1999, 2001లో సచిన్, 2011లో ధోనీ, తాజాగా కోహ్లీలు ఒంటరి పోరాటులు చేసినా టీమిండియా మ్యాచ్ నెగ్గలేకపోయింది.
Be the first to comment