కేసీఆర్ సోదరి కన్నుమూత… హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పయనం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే్ఖర్ రావు సోదరి లీలమ్మ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె పార్ధీవదేహాన్ని అల్వాల్ లోని నివాసానికి తరలించారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. లీలమ్మ ఇక లేరనే విషయం తెలిసి సీఎం బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*