కోహ్లీని ఆకాశానికెత్తిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో నలుగురు ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వారిలో ఎవురు బెస్ట్ అనే చర్చలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. వారు కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్. వీరు నలుగురు వరుసగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీల్యాండ్ జట్లకు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు.

వీరిలో ఎవరు నంబర్ వన్ అంటూ క్రికెట్ అభిమానులు, రైటర్లు, విశ్లేషుకులు నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంటారు. అయితే వ్యక్తిగతంగా ఆ నలుగురు ఈ విషయాన్ని పట్టించుకోనప్పటికీ ఎవరు గ్రేట్ అంటూ వాదనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. వీరు ప్రస్తుతం అన్ని ఫార్మెట్లలో నిలకడగా పరుగులు సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

అయితే అందరికంటే కోహ్లీ మాత్రం ఒక అడుగు ముందున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానానికి కూడా చేరుకున్నాడు. పైగా అన్ని ఫార్మెట్లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 50కి పైగానే ఉంది. ఇది మామూలుగా అయితే చాలా కష్టంమైన గణాకం. 2016 సీజన్ నుంచి కోహ్లీ టెస్టుల్లో ఆరు సార్లు డబుల్ సెంచరీలను సాధించాడు.

దీంతో అందరి దష్టీ సహజంగానే కోహ్లీవైపు మళ్లింది. కోహ్లీనే నంబర్ వన్ అంటూ ఎక్కువమంది చెప్పడం ప్రారంభించారు. ఈ నేపత్యంలో తాజాగా ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినప్పటికీ కెప్టె్న్ కోహ్లీని మాత్రం అంతా మెచ్చుకున్నారు. గెలుపు కోసం అతను చేసిన పోరాటాన్ని కీర్తించారు.

ఈ నేపధ్యంలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైక్ బ్రేర్‌లే కోహ్లీపై స్పందిస్తూ ఆకాశానికెత్తారు. కోహ్లీ ఉత్తమ ఆటగాడని, ప్రపంచంలో ప్రస్తుతం అతనే బెస్ట్ క్రికెటర్ అని కొనియాడారు. కోహ్లీకిలాగా మూడు క్రికెట్ ఫార్మెట్లలోనూ 50కి పైగా బ్యాటింగ్ యవరేజ్ ఉన్న ఏ ఆటగాడైనా చాలా చాలా మంచి ప్లేయర్ అంటూ కీర్తించారు.

ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ రూట్ కూడా మంచి ఆటగాడేనని, కానీ కోహ్లీ అంత ఉత్తమ ఆటగాడు కాదని చెప్పారు. కోహ్లీ మూడు ఫార్మెట్లలోనూ బాగా ఆడుతున్నాడని, 50లను శతకాలుగా మలచగలడని, కోహ్లీతో పోల్చుకుంటే రూట్ తక్కువేనని చెప్పారు. మైక్ బ్రేర్‌లే ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు 1976-1981 మధ్య కాలంలో 39 టెస్ట్ మ్యాచ్‌లు, 25 వన్డే మ్యాచ్‌లను ఆడారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*