
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కుమారులు స్టాలిన్, అళగిరి సీఎం పళనిస్వామిని కలిశారు. కరుణ ఆరోగ్య పరిస్థితిని ఆయనకు వివరించారు. కలైంజర్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని స్వయంగా కావేరీ ఆసుపత్రి వైద్యులే వెల్లడించిన నేపథ్యంలో స్టాలిన్, అళగిరి సీఎం పళని స్వామిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నారు. కావేరీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన తాజా హెల్త్‌బులెటిన్ ప్రకారం కరుణానిధికి ఎంత వైద్యసహాయం అందిస్తున్నా ఆయన అవయవాలు స్పందించడం లేదని తెలిపారు.
Press release from Kauvery Hospital. pic.twitter.com/ZK27g42GAd
— KalaignarKarunanidhi (@kalaignar89) August 7, 2018
మరోవైపు చెన్నైలో భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులంతా చెన్నైకి చేరుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు ఢిల్లీలో ఉన్న డీఎంకే రాజ్యసభ ఎంపీలు, కీలక నేతలను చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే అధిష్టానం ఆదేశించింది.
అటు డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కావేరీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమ అభిమాన నేత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా హడావుడి చూస్తుంటే చెడువార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో కార్యకర్తలున్నారు.
Be the first to comment