కరుణానిధి కన్నుమూత

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఇక లేరు. కలైంజర్ శకం ముగిసింది. కరుణ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

కరుణ కుమారులు స్టాలిన్, అళగిరి సీఎం పళనిస్వామిని కలిశాక చెన్నైలో భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులంతా చెన్నైకి చేరుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఢిల్లీలో ఉన్న డీఎంకే రాజ్యసభ ఎంపీలు, కీలక నేతలను చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే అధిష్టానం ఆదేశించింది.

కరుణ ఇక లేరనే విషయాన్ని కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

 

కరుణానిధి కన్నుమూశారని తెలిసిన వెంటనే ప్రధాని మోదీ ట్వీట్ చేసి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  ఆకాంక్షించారు.

రేపు సాయంత్రం కరుణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. మెరీనా బీచ్‌లో అన్నాదురై సమాధి పక్కన కరుణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఉదయం 7 గంటల నుంచి అంతిమ దర్శనానికి ఆయన భౌతికకాయాన్ని అందుబాటులో ఉంచుతారు. మరికాసేపట్లో ఆయన భౌతికకాయాన్ని కావేరీ ఆసుపత్రి నుంచి గోపాలపురంలోని కరుణ నివాసానికి తరలిస్తారు.

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*