కరుణ చివరిచూపు కోసం లక్షలాదిగా తరలివస్తోన్న అభిమానులు

చెన్నై: నిన్న కన్నుమూసిన డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధికి తమిళనాడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై తదితరులు నివాళి అర్పించారు. మరోవైపు కరుణ భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌కు తరలించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో కరుణ పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కరుణ చివరిచూపు కోసం తమిళనాడు నుంచే పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

మరోవైపు కరుణానిధి అంత్యక్రియల స్థల వివాదంపై విచారణ ఉదయం 8 గంటలకు విచారణ మొదలైంది. కౌంటర్ దాఖలకు మరింత సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. దీంతో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయానికి విచారణను వాయిదా వేశారు. అంత్యక్రియల కోసం సర్దార్ పటేల్ రోడ్‌లో ప్రభుత్వం ఇప్పటికే రెండు ఎకరాలు కేటాయించింది. అయితే అన్నాదురై సమాధి వద్ద స్థలం కేటాయించాలని కరుణానిధి కుటుంబం కోరుతోంది. అదే సమయంలో మెరీనా బీచ్‌లో అంత్రక్రియలు నిర్వహించేలా అనుమతివ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది. దీనిపై మద్రాస్ హైకోర్టు మరికాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*