కరుణానిధి అంత్యక్రియల స్థలంపై వివాదం.. కోర్టు మెట్లెక్కిన స్టాలిన్..

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలపై రాజకీయ వివాదం మొదలైంది. మెరీనా బీచ్‌లోని అన్నా స్వ్యేర్ ప్రాంతంలో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం సాధ్యం కాదని పళని స్వామి సర్కారు తేల్చి చెప్పింది. న్యాయపరమైన ఇబ్బందులు, శాంతి భద్రతల ఇబ్బందులు, పర్యావరణ ఇబ్బందులు కూడా తలెత్తుతాయని తెలిపింది.

గాంధీమండపం సమీపంలో స్థలం కేటాయిస్తామని పళని స్వామి సర్కారు స్పష్టం చేసింది. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తే కరుణ స్మారక నిర్మాణానికి కూడా ఇబ్బందులుంటాయని ప్రభుత్వం తెలిపింది.

 

మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని డీఎంకే వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాత్రి పదిన్నరకు మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌పై విచారణ జరగనుంది. డీఎంకే పిటీషన్‌పై చీఫ్ జస్టిస్ జి. రమేశ్ వాదనలు విని తీర్పిస్తారు.

మరోవైపు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి డీఎంకే శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. పళనిస్వామి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*