కరుణానిధి గురించి 20 ఆసక్తికర విషయాలు

కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి.

1924 జూన్ మూడున తంజావూరులోని తిరుక్కువలైలో తెలుగు నాయిబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

కరుణ తల్లిదండ్రుల పేర్లు ముత్తవేల్, అంజు. కరుణకు ముగ్గురు భార్యలు.

కరుణానిధి భార్యల పేర్లు పద్మావతి దయాళు అమ్మాళ్, రాజత్తి అమ్మాళ్

ఆరుగురు సంతానం. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

పెరియార్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు.

ఐదుసార్లు తమిళనాడు సీఎంగా పనిచేశారు.

13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

50 ఏళ్లు డీఎంకే అధినేతగా కొనసాగారు.

తమిళ సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

పద్యాలు, నాటికలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు రాశారు.

1942లో మురసోలి పత్రికను ప్రారంబించారు.

దక్షిణ భారత చలన చిత్ర రంగం నుంచి సీఎం అయిన మొదటి వ్యక్తి కరుణానిధి.

75కు పైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాశారు.

మణిమకుటం సినిమాకు జయలలితతో కలిసి పనిచేశారు.

విద్యార్ధి సంఘాల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

1938లో హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు.

1969లో అన్నాదురై మరణంతో సీఎంగా కరుణ బాధ్యతలు స్వీకరించారు.

ప్రజాకర్షక పథకాలకు కరుణ ఆద్యుడు

కరుణకు కలైంజర్ అనే బిరుదు ఉంది.

2004 నుంచి 2014 వరకూ యూపీఏలో కీలక పాత్ర పోషించారు.

2009లో తమిళ టైగర్లపై శ్రీలంక సైన్యం చేపట్టిన సైనిక చర్యను నిరసిస్తూ దీక్ష చేపట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*