మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు?.. అన్ని పిటీషన్లనూ కొట్టివేసిన మద్రాస్ హైకోర్ట్

చెన్నై: కరుణానిధి అంత్యక్రియల స్థల వివాదంపై మద్రాస్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపితే ఇబ్బంది లేదంటూ గతంలో ట్రాఫిక్ రామస్వామి గతంలో వేసిన కేసును ఉపసంహరించుకున్నారు. చీఫ్ జస్టిస్ రమేశ్ ట్రాఫిక్ రామస్వామితో మాట్లాడటంతో ఆయన తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రాతపూర్వకంగా రాసిచ్చారు. దీంతో రామస్వామి పిటీషన్‌తో పాటు అన్ని పిటీషన్లను మద్రాస్ హైకోర్టు డిస్మిస్ చేసింది.

రాష్ట్ర జనాభాలో డీఎంకే అభిమానులు కోటిమందిదాకా ఉన్నారని డీఎంకే వాదించింది. ఐదుసార్లు సీఎంగా చేసిన కరుణకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు ఎందుకు చేయరాదని ప్రశ్నించింది. అనుమతి లభించకపోతే డీఎంకే అభిమానుల సెంటిమెంట్ దెబ్బతింటుందని వాదించింది. అటు ప్రభుత్వం ప్రొటోకాల్ అని వాదించింది. చెన్నై కార్పొరేషన్ అనుమతి ఇస్తుందని, తాము కాదని స్పష్టం చేసింది. డీఎంకే రాజకీయ అజెండాతో తాజా వివాదాన్ని సృష్టించిందని ప్రభుత్వం వాదించింది.

మరోవైపు కరుణ అంత్యక్రియలపై ఇప్పటికిప్పుడు అత్యవసరంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అయితే ఇవాళే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం రాజాజీ హాల్‌లో కరుణ భౌతికకాయానికి ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కరుణ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా చెన్నై తరలివస్తున్నారు. మమత నిన్ననే చెన్నై చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం కేరళ సీఎం పినరాయి విజయన్ నివాళులర్పించారు.

తమిళనాట వారం రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. రెండురోజుల పాటు అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*