ఉగ్రవాదులను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన హైదరాబాద్ అమ్మాయి సనా

హైదరాబాద్: ఎన్‌ఐఏ విచారణకు అబ్దుల్ ఖాదిర్, మరో ఏడుగురు హాజరయ్యారు. సోమవారం అబ్దుల్ ఖాదిర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ల్యాప్‌టాప్‌తో పాటు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

19 ఏళ్ల ఖాదిర్ షాహీన్ నగర్‌లో ఇంటర్నెంట్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అవకాశం లభించి ఉగ్రవాదులతో ఆన్‌లైన్ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చాడు. అంతేకాదు బాసిత్, సనాకు ఉగ్రవాదులతో పరిచయాలు చేయించాడు. దీంతో సిరియాకు వెళ్లి ఉగ్రవాదులను పెళ్లి చేసుకునేందుకు సనా యత్నించిందని తెలిసింది.

గత ఏడాది ఐసిస్ సానుభూతిపరులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఈసారి ఐసిస్ సానుభూతిపరులు పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నారనే సమాచారంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తమకు అందిన పక్కా సమాచారంతో ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ పాతబస్తీ సహా అనేక చోట్ల తనిఖీలు జరిపారు. మొబైళ్లు, ట్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు బీహార్ బోథ్‌గయ పేలుళ్ల నిందితుడిని ఎన్‌ఐఏ కర్ణాటక రాజధాని బెంగళూరులో అరెస్ట్ చేసింది. జమాత్ ఉల్ ముజాహిదీన్‌కు చెందిన మహ్మద్ జహిదుల్ ఇస్లామ్‌ను అరెస్ట్ చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలను, పేలుడు పదార్ధాలను అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని రిమాండ్‌కు తరలించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*