
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో మహిళా డాక్టర్ శిల్ప అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. జాగృతి అపార్టుమెంట్ లోని తన ఇంట్లో ఆమె ఉరివేసుకున్నారు.
ఐదేళ్ల క్రితం రూపేష్ కుమార్తో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలలోని పీడీయాడ్రిక్ డిపార్టుమెంట్లో పిజి స్టూడెంట్ అయిన తనను కొందరు ప్రొఫెసర్లు వేధించారని ఏప్రిల్ నెలలో ఆమె ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
శిల్ప ఫిర్యాదు చేసినా వేధించిన డాక్టర్లపై చర్యలు తీసుకోలేదని ఆమె మనోవేదనతో ఉండేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శిల్ప ఆత్మహత్యపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రుయాలో లైంగిక వేధింపుల ఘటనను మీడియా వెలుగులోకి తెచ్చింది.
Be the first to comment