శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సింగపూర్‌లో భాగవత జయంతి వేడుకలు

సింగపూర్: “తెలుగు భాగవత ప్రచార సమితి” సంస్థ వారు సింగపూర్‌లో సెప్టెంబర్ రెండో తేదీ ఆదివారం నాడు కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించనున్న భాగవత జయంత్యుత్సవం 2018 వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను విడుదల చేశారు.

భారతీయ సనాతన హిందూ ధర్మంలో ప్రముఖ స్ధానం ఉన్న ఇతిహాస గ్రంధమైన “శ్రీమద్భాగవత” గ్రంధం సదా మానవజాతికి ఆదర్శ ప్రాయము మరియు అనుసరణీయమని ఈ తరం వారికి తెలియజేస్తూ, నేటి యువతరం కూడా ఉత్సాహవంతంగా పాల్గొనేలా చేయాలనే సంకల్పంతో బాలల బొమ్మల/ కథల పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. పిల్లలకు పెద్దలకు కూడా అనువైన విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

భాగవత ప్రచార సమితి సింగపూర్ అధ్యక్షుడు ఊలపల్లి భాస్కర్ మాట్లాడుతూ.. భాగవత పారాయణము, ప్రవచనము, భక్తి పాటలు, పిల్లల పాటలు, భాగవతం లోని వివిధ పాత్రల వేషధారణలు, పోటీలు మరియు ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమిని వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిగా ప్రముఖ వక్త, ఉపనిషత్తులలో పట్టభద్రుడు మాజీ డీజీపీ (ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ), డాక్టర్ కరణం అరవిందరావు పాల్గొని తమ ప్రసంగిస్తారని తెలిపారు. భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో సంస్థ ఐదవ వార్షికోత్సవాన్ని కూడా పురస్కరించుకుని ఈ ఏడాది హైదరాబాద్, సింగపూర్ లో రెండో తేదిన, వెరవలో ఎనిమిదో తేదీన ఈ భాగవత జయంతోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. అన్ని కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని కూడా తెలిపారు.

కృష్ణాష్టమి నాటి ఈ వేడుకలకు అందరూ సపరివార సమేతంగా విచ్చేసి తీర్దప్రసాదాలు అందుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో భాస్కర్ విద్యాధరి, రవితేజ, రాధిక, మమత నమ్రత, లావణ్య, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*