ఫలించిన డీఎంకే న్యాయపోరాటం… మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు డీఎంకే కోరుకున్నట్లే మెరీనా బీచ్‌లోనే జరగనున్నాయి.  కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు తమిళనాడు సర్కారు వ్యతిరేకించిన నేపథ్యంలో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నిన్న అర్ధరాత్రి వాదనలు సాగాయి. నేటి ఉదయానికి వాయిదా పడిన ఈ అంశంపై కొద్ది సేపటి ముందు వరకూ వాదనలు కొనసాగాయి. డీఎంకేతో పాటు ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది.

నిబంధనల సాకుతో మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు వద్దని ప్రభుత్వం వాదించగా, తమ కార్యకర్తల సెంటిమెంట్ అని డీఎంకే వాదించింది. అటు ట్రాఫిక్ రామస్వామి సహా పిటిషనర్లంతా తమ కేసులను ఉపసంహరించుకున్నారు. చివరకు మెరీనా అన్నా స్క్వేర్ వద్ద అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో డీఎంకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

సాయంత్రం 4 గంటలకు కరుణ అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు కరుణ భౌతికకాయానికి రాజాజీ హాల్‌లో ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కమల్‌హాసన్, రజినీ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే నివాళులర్పించారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*