కన్నీళ్లు ఆపుకోలేకపోయిన స్టాలిన్..

చెన్నై: కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినివ్వగానే ఆయన తనయుడు స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి పోరాట స్ఫూర్తితో అంత్యక్రియల కోసం ప్రభుత్వంతో పోరాటం చేసిన ఆయన హైకోర్టు తీర్పు రాగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజాను, డీఎంకే నేతలను కౌగిలించుకున్నారు. ఎట్టకేలకూ కోర్టు అనుమతినివ్వడంతో ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాజా, కనిమొళి, ఇతర నేతలు కూడా స్టాలిన్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు తీర్పుతో రాజాజీ హాల్ వద్ద డీఎంకే శ్రేణులు భావోద్వేగానికి గురయ్యారు.

ఎప్పుడూ గంభీరంగా ఉండే తమ నేత స్టాలిన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడంతో డీఎంకే శ్రేణులు భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో కరుణకు నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు. జోహార్లు అర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*