మిమ్మల్ని విడిచిపెట్టను: టీడీపీ నేతలకు జీవీఎల్ వార్నింగ్

టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైంది: జీవీఎల్

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్‌ గెలుపొందడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హరి ప్రసాద్‌‌కు టీడీపీ ఓటెయ్యడంపై మండిపడ్డారు. టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైందన్నారు. కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ ఘోర పరాజయానికి గురైందని చెప్పారు. కాంగ్రెస్ చెంతన చేరి టీడీపీ అవినీతి గబ్బులో చేరింది. టీడీపీ ప్రభుత్వాన్ని త్వరలో ప్రజల ఎదుట దోషిగా నిలబెడతానని జీవీఎల్ చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీని ప్రజలు తిరస్కరిస్తారని జీవీఎల్ జోస్యం చెప్పారు. స్కాములపై తాను మాట్లాడుతుంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు సరైన సమాధానాలు చెప్పేంతవరకూ విడిచిపెట్టబోనన్నారు.

అంతకు ముందు రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్‌‌కు 125 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హరి ప్రసాద్‌‌కు 105 సీట్లు వచ్చాయి.

టీడీపీ రాజ్యసభ ఎంపీలందరూ కాంగ్రెస్‌కు ఓటేశారు. అటు టీఆర్ఎస్, బీజేడీ ఎన్డీయేకు ఓటేశాయి. వైసీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*