బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన బాబు గోగినేని.. రోల్‌ రైడాపై బిగ్ ‌బాంబ్..

హైదరాబాద్: 63 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన హేతువాది బాబు గోగినేని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. జోరు వానలో తడుస్తూనే బాబు గోగినేనికి మిగతా పార్టిసిపెంట్స్ బైబై చెప్పారు. గీతా మాధురి, నూతన్ నాయుడు బాబు గోగినేని పాదాలకు నమస్కరించారు. తాను ఇన్ని రోజులు హౌస్‌లో కొనసాగానంటే ప్రేక్షకుల వల్లేనని బాబు గోగినేని చెప్పారు.

బాబు గోగినేని పోతూపోతూ బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై వేశారు. ఈ వారం మొత్తం బాత్‌రూమ్‌లు శుభ్రం చేసే బాధ్యత రోల్‌కి పడింది. ఈ విషయంలో సామ్రాట్ గైడెన్స్ ఇస్తాడు. హౌస్‌లో మిగతావారి నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని బాబు గోగినేని చెప్పారు. చిన్నప్పటి నుంచీ తాను ఆడిన ఆటలన్నీ సరదా కోసమేనని, ఎప్పుడూ గెలవడం కోసం ఆడలేదని బాబు గోగినేని చెప్పారు.

వాస్తవానికి బాబూ గోగినేని బిగ్‌బాస్ టూ విజేతగా నిలుస్తారని అంతా ఆశించారు. అయితే అనూహ్యంగా ఆయన ఎగ్జిట్ అయిపోయారు. ప్రస్తుతానికి కౌశల్ టాప్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అండ కౌశల్‌కు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నూతన్ నాయుడు సేన కూడా కౌశల్‌కు సపోర్ట్ చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*