ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో దారుణం.. మరో మెడికో ఆత్మహత్య

తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి శివజ్యోతినగర్‌లో ఉంటోన్న గీతిక కడప జిల్లా వాసి. శిల్ప ఆత్మహత్య ఘటన సద్దుమణగకముందే కాలేజీలో మరో దారుణం జరగడంతో కలకలం రేగింది. గీతిక ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఎస్వీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల వేధింపులపై కొన్ని రోజులుగా మెడికోల ఆందోళనలు జరుగుతున్నాయి. డాక్టర్ శిల్ప ఆత్మహత్య వ్యవహారంలో నిందితులకు వైద్యులు వత్తాసు పలుకుతుండగా జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. జూడాలకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఈ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*