12-08-2018 నుండి 18-08-2018 వరకు వారఫలాలు

మేషరాశి :  ఈవారం మొత్తం మీద వ్యాపారపరమైన విషయాల్లో ఒక అడుగుముందుకు పడుతుంది, నూతన అవకాశాలు పొందుతారు. తండ్రితరుపు బంధువుల నుండి లేక తండ్రి నుండి ఆర్థికపరమైన సహకారం పొందుతారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వేచిచూసే ధోరణి వలన మేలుజరుగుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, మీ మాటతీరు మూలన విభేదాలు వచ్చే అవకాశం కలదు, జాగ్రత్త. చేపట్టిన పనులను మిత్రులతో కలిసి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట మేలుజరుగుతుంది.

వృషభరాశి :  ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మానసికపరమైన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది, దృడంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. పెద్దలతో అనుకోకుండా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, సర్దుబాటు మంచిది.


  మిథునరాశి:   ఈవారం మొత్తం మీద అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. మీ ఆలోచనలతో పెద్దలను ఒప్పించుకొనే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాల అయ్యే ఆస్కారం ఉంది. చిన్న చిన్న పనులను మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న వారు ప్రదేశం మారుతారు. వారం మధ్యలో కొద్దిగా పనిఒత్తిడి ద్వారా , అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. 

కర్కాటకరాశి :   ఈవారం మొత్తం మీద పెద్దలతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మాటపడవలసి వస్తుంది. దూర ప్రదేశ ప్రయాణాలు వాయిదా పడుతాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. కుటుంబంలో సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నంలో అత్యుత్సాహం వలన నష్టపోయే అవకాశం ఉంది. చర్చల్లో మీ ఆలోచనలను అందరికి తెలియజేసే ప్రయత్నం మంచిది.

సింహరాశి :  ఈవారం మొత్తం మీద ఆత్మీయులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారై సూచనలను పాటించుట మంచిది. చిన్న చిన్న వ్యాపార ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గిచుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలతో సమయాన్ని గడుపుతారు, కొన్నివిషయాల్లో ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీలో మానసికదైర్యం సన్నగిల్లే అవకాశం ఉంది , కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన.

కన్యారాశి : ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును పొందుతారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడుటకు ఆస్కారం ఉంది, సర్దుబాటు విధానం వలన మేలుజరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. సంతానపరమైన విషయాల్లో కొంత  నిరాశకు గురయ్యే ఆస్కారం ఉంది, ప్రణాలిక కలిగి ఉండుట మంచిది.

తులారాశి:  ఈవారం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. సమయాన్ని సరదాగా గడపటం వలన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమాయానికి చేతికి అందుతుంది. జీవితభాగస్వామి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయుట సూచన.

వృశ్చికరాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువుల కోసం దహనం వెచ్చిస్తారు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది, సర్దుబాటు విధానం మంచిది.

ధనస్సురాశి:    ఈవారం మొత్తం మీద చర్చలకు సమయం ఇస్తారు, తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి లేక ప్రమోషన్ లభించే ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన, ఎవ్వరికి ఆర్థికపరమైన విషయాల్లో స్థాయికి మించి హామీఇవ్వుట లేక సహాయం చేయుట వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో మాత్రం తొందరపాటు వద్దు ఒకసారి పత్రాలు చెక్ చేసుకోవడం వలన మేలుజరుగుతుంది.

మకరరాశి :    ఈవారం మొత్తం మీద విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టిని చూపించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. స్త్రీ సంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. ;పెద్దలతో పరిచయాలు ఏర్పడుతాయి, వాటి మూలన మేలుజరుగుతుంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి, ఆశించిన మేర సహకారం లభిస్తుంది.  చర్చల్లో కాస్త నిదానం అవసరం.

కుంభరాశి : ఈవారం మొత్తం మీద బంధువులతో లేక కుటుంబసభ్యు ల తో సమయాన్ని గడుపుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారప్రయత్నాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందం పొందుతారు. ప్రణాళిక కలిగి ఉంది ముందుకు వెళితే మరింత మంచి ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువావరికి అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి.

మీనరాశి :    ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలో స్పష్టత ఉండేలా ప్రణాలిక కలిగి ఉండుట మంచిది. ఉద్యోగంలో పెద్దలతో ఆలోచనలు పంచుకుంటారు. కుటుంబంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో మార్పును కోరుకుంటారు.

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*